- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అందమైన కట్టుకథను ప్రచారం చేస్తున్న సీఎం.. రైతు ధర్నాపై హరీశ్ రావు రియాక్ట్

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: రుణమాఫీ కాలేదంటూ తాజాగా గాంధీభవన్ (Gandhi bhavan) మెట్ల మీద వృద్ధ రైతు నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే స్పందిస్తూ శుక్రవారం మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. అందరికీ రుణమాఫీ చేసినట్లు అందమైన కట్టుకథను ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy).. మిమ్మల్ని నిలదీసేందుకు తుంగతుర్తి నుంచి గాంధీ భవన్ దాకా వచ్చిన రైతు తోట యాదగిరికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. మీరిచ్చిన ఆరు గ్యారెంటీలు ఎన్నికల గారడీనేనని, 420 హామీల అమలు వట్టి బూటకమేనని (Telangana) తెలంగాణ ప్రజలు తక్కువ సమయంలోనే తెలుసుకున్నారని విమర్శించారు. మిమ్మల్ని నిలదీసేందుకు ఒక్కొక్కరిగా గాంధీభవన్‌కు చేరకముందే పాపపరిహారం చేసుకోండని హితువుపలికారు. రైతులు, మహిళలకు, విద్యార్థులకు, వృద్ధులకు, ఉద్యోగులకు.. అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండని డిమాండ్ చేశారు.
ఈ రోజు గాంధీ భవన్ దాకా వచ్చిన వారు, రేపో మాపో మీ జూబ్లీహిల్స్ ప్యాలెస్ దాకా వస్తారు.. ప్యాలెస్ పాలన వదిలి ప్రజా పాలన కొనసాగించు అని పేర్కొన్నారు. ఏడు పదుల వయస్సులో రుణమాఫీ కోసం బ్యాంకుల చుట్టూ తిరిగిండు, అధికారులను వేడుకున్నడు.. అయినా వెనకడుగు వేయకుండా గాంధీభవన్ దాకా వచ్చి పోరాటం చేస్తున్న రైతు యాదగిరి పట్టుదలకు అభినందనలు.. అంటూ తెలియజేశారు. ఇదే స్ఫూర్తితో అన్ని వర్గాల ప్రజలు మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేయాలని, హామీలు అమలు చేసే దాకా కొట్లాడాలని బీఆర్ఎస్ పక్షాన పిలుపునిచ్చారు.