BRSలో హరీష్ రావు మంచి నాయకుడు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

by Rajesh |
BRSలో హరీష్ రావు మంచి నాయకుడు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి హరీష్ రావుపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్‌లో నిర్వహించిన మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న అనంతరం మీడియాతో బండి సంజయ్ మాట్లాడారు. హరీష్ రావు మంచి నాయకుడు, ప్రజల మనిషి అన్నారు. హరీష్ రావు బీజేపీలోకి వస్తే పదవికి రాజీనామా చేసి రావాలని కోరారు. తాను హరీష్ రావుతో మాట్లాడలేదని కుండ బద్ధలు కొట్టారు. బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు ఒక్కడే మంచి నేత అని బండి కితాబు ఇచ్చారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఒక డ్రామా అని కొట్టిపారేశారు. బీజేపీలోకి ఎవరు వచ్చినా రాజీనామా చేసే రావాలని క్లారిటీ ఇచ్చారు.



Next Story