APని చూసి కాంగ్రెస్ సర్కారు కళ్లు తెరవాలి.. హరీష్ రావు ఆసక్తికర ట్వీట్

by Rajesh |
APని చూసి కాంగ్రెస్ సర్కారు కళ్లు తెరవాలి.. హరీష్ రావు ఆసక్తికర ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు అంశంలో మాజీమంత్రి హరీష్ రావు సీరియస్ అయ్యారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. కాంగ్రెస్ హామీలు నీటి మూటలను తలిపిస్తున్నాయన్నారు. 100రోజుల్లోనే హామీలు అమలు చేస్తామన్నారని.. 191 రోజులైనా హామీల అమలులో విఫలమయ్యారన్నారు. పక్క రాష్ట్రం ఏపీలో అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి అన్ని రకాల పింఛన్లు పెంచితే, ఒరిస్సా ముఖ్యమంత్రి వరి కనీస మద్దతు ధర క్వింటాల్ రూ.3100 చేస్తూ నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలని.. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా, వృద్ధులు, వితంతువుల పింఛన్లు రూ.4వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు పెంచుతూ తక్షణం నిర్ణయం తీసుకోవాలన్నారు. పది శాతం పండించే సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని చేతులు దులుపుకున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో చెప్పినట్లుగా అన్ని రకాల వడ్లకు బోనస్ ఇస్తామని ప్రకటించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన 6 గ్యారంటీలు, 13 హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed