- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కిర్గిస్థాన్‌లో విద్యార్థుల భద్రతకు చర్యలు చేపట్టాలి: హరీష్ రావు
దిశ, తెలంగాణ బ్యూరో: కిర్గిస్థాన్‌లో తెలంగాణ విద్యార్థుల భద్రత కోసం వెంటనే పటిష్ట చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు కోరారు. సోమవారం ట్వీట్ చేశారు. కిర్గిస్థాన్ రాజధాని బిష్క్‌క్‌లోని భారతీయ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని జగుతున్న హింసాత్మక సంఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ఆ హింసలో పలువురు భారతీయ విద్యార్థులు గాయపడ్డారని తెలిపారు. మన దేశ విద్యార్థులతో పాటు వివిధ దేశాల విద్యార్థులపై స్థానికులు దాడులు చేయడంతో పరిస్థితి దిగజారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంక్షోభాన్ని గట్టెక్కడానికి, విద్యార్థుల భద్రతపై వారి కుటుంబాలకు భరోసా ఇవ్వడానికి సీఎం కార్యాలయంతో పాటు భారత విదేశాంగ మంత్రి జైశంకర్, బిష్కెక్‌లోని భారత రాయబార కార్యాలయ అధికారులు దౌత్యపరంగా పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని కోరారు.
ప్రజారోగ్యంపై కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. డయాగ్నస్టిక్ కేంద్రాల నిర్వహణ, సిబ్బంది పెండింగ్ జీతాలపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. రాష్ట్ర ప్రజలకు పూర్తి ఉచితంగా వైద్య పరీక్షలు అందించేందుకు బీఆర్ఎస్ పాలనలో ప్రారంభించిన తెలంగాణ డయాగ్నస్టిక్ వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం 5 నెలల్లోనే కుప్పకూల్చడం బాధాకరం అన్నారు. కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా 36 డయాగ్నస్టిక్ కేంద్రాలు ఏర్పాటు చేసి, 134 రకాల వైద్య పరీక్షలను అందుబాటులోకి తీసుకొచ్చి వైద్య సేవల్లో తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపారన్నారు. నిరుపేద, సామాన్య ప్రజలకు ఆర్థిక భారం లేకుండా చేసి, నాణ్యమైన వైద్య పరీక్షలను అందించిన డయాగ్నస్టిక్ కేంద్రాలు ఇప్పుడు నిర్వహణ లోపంతో కొట్టుమిట్టాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సిబ్బందికి ఆరు నెలలుగా వేతనాలు కూడా చెల్లించలేని దుస్థితి నెలకొందన్నారు. ప్రజారోగ్యం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి ఇది నిదర్శనమని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి డయాగ్నస్టిక్స్ కేంద్రాల్లో పని చేస్తున్న వైద్యులకు, సిబ్బందికి ఆరు నెలల పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. డయాగ్నొస్టిక్ కేంద్రాల ద్వారా అన్ని రకాల పరీక్షలు, వైద్య సేవలు ప్రజలకు అందే విధంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Read More...
ఫస్ట్ డే 77% హాజరు.. రెండు సెషన్లలో సైన్స్ మ్యాథ్స్ పరీక్షలు