‘కేసీఆర్ ముళ్ల బాట.. పూల బాట రెండూ చూశారు’

by GSrikanth |
‘కేసీఆర్ ముళ్ల బాట.. పూల బాట రెండూ చూశారు’
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతిపక్షంలో ఉండటం తమకు కొత్త కాదని.. నాడు పది సీట్లు వచ్చినా వెనకడుగు వేయలేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. శనివారం సిద్దిపేటలో పర్యటించిన ఆయన అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ముళ్ల బాట, పూల బాట రెండూ చూసిందని అన్నారు. కాంగ్రెస్ బెదిరింపులకు భయపడబోమని తెలిపారు. రాష్ట్రంలో కేవలం 1.8% శాతం ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అధికారం కోల్పోయిందని అన్నారు. దళితబంధు, బీసీబంధుతో ఇబ్బంది జరిగిందని చెప్పారు. బీఆర్ఎస్ విమర్శలు మాని కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు.

ప్రచారంలో అబద్ధాలు చెప్పి.. ప్రభుత్వంలోకి వచ్చాక అసహనానికి గురవుతున్నారని విమర్శించారు. కేటీఆర్ దావోస్ పర్యటనను దండగ అన్నవారే దావోస్‌కు వెళ్లొచ్చారని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపు ఇచ్చిన గ్యారంటీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేసేవరకు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటే పడుతామని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ఢిల్లీ వెళ్లి రూ.14 వేల కోట్ల అప్పు తెచ్చారని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ కూడా కేవలం మాటలు చెప్పే ప్రభుత్వమని.. పనులు చేసే ప్రభుత్వం కాదని అన్నారు.

Advertisement

Next Story