- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అభివృద్ధి కమిటీ వేధింపులు.. భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం
దిశ, ప్రతినిధి నిర్మల్: అభివృద్ధి కమిటీ వేధింపులతో భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన నిర్మల్ పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలోని బెస్తవార్ పేట్‌కు చెందిన చంద్రశేఖర్ ఆయన భార్య లక్ష్మిలు పురుగుల మందు తాగి శుక్రవారం ఆత్మహత్యకు యత్నించారు. వీరికి పట్టణంలోని చింత కుంటవాడలో దుకాణ సముదాయం ఉంది.
ఈ విషయంలో చింత కుంట వాడ అభివృద్ది కమిటీ ప్రతినిధులు కాంప్లెక్స్ నిర్మాణం ప్రభుత్వ స్థలంలో నిర్మించారని కాలనీ అభివృద్ధి కమిటీకి రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని తెలిపారు. వారి వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి దాపురించిందని ఆర్యవైశ్య సంఘం సభ్యులు భారీ ఆందోళన చేశారు. కలక్టరేట్‌ను ముట్టడికి యత్నించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్‌లో వేదింపులకు గురి చేసిన వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.