ఈ జిల్లాల్లో వడగండ్ల వానలు.. నేటి నుంచి 7 రోజుల పాటు వర్షాలు

by Prasad Jukanti |
ఈ జిల్లాల్లో వడగండ్ల వానలు.. నేటి నుంచి 7 రోజుల పాటు వర్షాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో:తెలంగాణలో పలు జిల్లాలో శనివారం ఉదయం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో నేటి నుంచి వారం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో గంటకు 50-60 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, వర్షాలతో పాటు వడగండ్ల వర్షాలు కూరిసే అవకాశం ఉందని హెచ్చరించిది. రాబోయే వారం రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిచే అవకాశం ఉందని పేర్కొంది. మరో వైపు ఎండలతో సతమతం అవుతున్న ప్రజలకు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు కాస్త ఉపశమనం ఇస్తుంటే కల్లాల వద్ద ఉన్న ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ జిల్లాలకు అలర్ట్:

శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు జిగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్,హన్మకొండ, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ వడగండ్ల వానలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ను జారీ చేసింది. ఇక నల్గొండ, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్ జిల్లాల్లో గంటకు 30-40 కి.మీ వేగంతో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు విస్తాయని, తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు మంచిర్యాల, నల్గొండ, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

Advertisement

Next Story