దారుణం.. నొప్పితో విలవిల్లాడుతున్న విడిచిపెట్టకుండా చిత్రహింసలు!?

by Jakkula Mamatha |   ( Updated:2025-04-13 06:56:51.0  )
దారుణం.. నొప్పితో విలవిల్లాడుతున్న విడిచిపెట్టకుండా చిత్రహింసలు!?
X

దిశ,వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో అడవుల్లో నుంచి జంతువులు గ్రామాల్లోకి చొరబడి హల్‌చల్ చేస్తున్న ఘటనలు గమనిస్తూనే ఉన్నాం. చిరుత, ఎలుగుబంటి, సింహం ఇంకా వివిధ రకాల జంతువులు నేరుగా ఇళ్లల్లోకి ప్రవేశిస్తున్న ఘటనలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే అవి అడవిలో నుంచి దారి తప్పి పోయో లేదా ఆకలి, దాహం వేస్తానో గ్రామంలోకి వస్తాయి. ఈ క్రమంలో తాజాగా దారి తప్పి గ్రామంలోకి వచ్చిన ఓ ఎలుగుబంటికి షాకింగ్ ఘటన ఎదురైంది.

వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలోని ఓ గ్రామంలోకి ఎలుగుబంటి(Bear)చొరబడింది. ఆ ఎలుగుబంటిని చూసిన గ్రామస్తులు షాక్ అయ్యారు. ఈ క్రమంలో ఆ గ్రామస్థులు ఆగ్రహనికి గురై దానికి నరకం చూపించారు. ఈ తరుణంలో గ్రామంలోకి ప్రవేశించిన వెంటనే ఆ ఎలుగుబంటిని బంధించారు. ఈ క్రమంలో దానిని గ్రామస్థులు దారుణంగా హింసించారు. ఎలుగుబంటి నోటిని విరిచేశారు. కాలి గోళ్లను తొలగించారు. నోటిపై బలంగా కొట్టడంతో తల్లడిల్లిపోయి ఆర్తనాదాలు చేసింది. ఇదంతా అక్కడ ఉన్నవారు అడ్డుకోకుండా చోద్యం చూశారు.

ఇక ఆ ఎలుగుబంటి నొప్పితో విలవిల్లాడుతున్న విడిచిపెట్టకుండా తీవ్రంగా దాడి చేసి, చిత్రహింసలకు గురిచేశారు. ఇక ఆ బాధ భరించలేని ఎలుగుబంటి చివరికి ప్రాణాలు కోల్పోయింది. అయితే ఈ విషాద ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమా(Social Video)ల్లో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో మూగజీవిని చిత్రహింసలకు గురిచేసిన వారిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన పై అటవీశాఖ(Forest department) చీఫ్ కన్జర్వేటర్ ఆర్‌సీ దుగ్గ స్పందిస్తూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎలుగుబంటిని చిత్రహింసలకు గురిచేసిన నిందితులకు కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు సైతం వారిపై విమర్శలు గుప్పిస్తున్నారు.



Next Story

Most Viewed