- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్యూ న్యూస్ పై గుండాయిజం.. తెరపైకి కేటీఆర్, కవిత, మల్లారెడ్డి పేర్లు..?
దిశ, మేడిపల్లి: తీన్మార్ మల్లన్నకు చెందిన క్యూన్యూస్ పై దుండగలు రెచ్చిపోయారు. క్యూ న్యూస్, శనార్తి తెలంగాణ కార్యాలయాన్ని టార్గెట్ చేసి దాడులకు తెగబడ్డారు. ఆదివారం మేడ్చల్ జిల్లా ఫీర్జాదిగూడలోని క్యూ న్యూస్ కార్యాలయంలోకి దాదాపు 25 మంది గుర్తు తెలియని వ్యక్తులు అక్రమంగా చొరబడ్డారు. కార్యాలయంలోని అద్దాలు, ఫర్నీచర్, హార్డ్ డిస్క్ లను పగులగొట్టి బీభత్సం సృష్టించారు.
స్థానికులు దాడిలో పాల్గొన్న ఓ వ్యక్తిని పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై మేడిపల్లి పోలీసులకు తీన్మార్ మల్లన్న ఫిర్యాదు చేశారు.జరిగిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి, కేటీఆర్, కవిత అనుచరులే తమపై దాడికి పాల్పడ్డారని మల్లన్న టీం ఆరోపించింది. దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని మల్లన్న టీం డిమాండ్ చేస్తోంది. తాను బయటకు వెళ్లినప్పుడు వచ్చి ఆఫీసుపై దాడి చేశారని తీన్మార్ మల్లన్న తెలిపారు. బీఆర్ఎస్ గుండాలే ఈ దాడికి పాల్పడ్డారని మల్లన్న ఆరోపించారు.
నెంబర్ ప్లేట్ లేని మూడు కార్లలో వచ్చి దాడి చేశారని మల్లన్న చెప్పారు. పోలీసులకు తెలిసే దాడి జరిగిందని, ఇందులో పోలీసుల పాత్ర కూడా ఉందని ఆరోపించారు. గతంలో జరిగిన దాడికి సంబంధించి ఒకరిని కూడా పోలీసులు పట్టుకోలేదని మల్లన్న అన్నారు. నాలుగు సార్లు క్యూ న్యూస్ ఆఫీస్ పై దాడి జరిగినా వార్తలు ఆగలేదన్నారు. ఆఫీసు ఖాళీ చేయించాలని తమ ఆఫీసు ఓనర్ ను పోలీసులు బెదిరిస్తున్నారని మల్లన్న తీవ్ర ఆరోపణలు చేశారు.