గ్రూప్-2, 3 పోస్టులు పెంచాల్సిందే.. ఇందిరా పార్క్ వ‌ద్ద నిరుద్యోగుల మ‌హా ధ‌ర్నా

by Ramesh N |
గ్రూప్-2, 3 పోస్టులు పెంచాల్సిందే.. ఇందిరా పార్క్ వ‌ద్ద నిరుద్యోగుల మ‌హా ధ‌ర్నా
X

దిశ, డైనమిక్ బ్యూరో: గ్రూప్-1 మెయిన్స్‌కు 1:100 పిల‌వాల‌ని, గ్రూప్-2, గ్రూప్-3 పోస్టులు పెంచాల‌ని నిరుద్యోగులు డిమాండ్ చేస్తూ ధ‌ర్నాకు దిగారు. గురువారం ఇందిరా పార్కు, ధర్నా‌చౌక వద్ద చేప‌ట్టిన ఈ ధ‌ర్నాకు ప‌లు పార్టీల‌కు చెందిన రాజ‌కీయ నాయ‌కులు మ‌ద్ద‌తు తెలిపారు. ఈ సందర్భంగా నిరుద్యోగులు మాట్లాడుతూ.. గ్రూప్‌-2లో 2 వేల పోస్టులు, గ్రూప్ -3లో 3 వేల పోస్టుల‌కు పెంచాల‌ని నిరుద్యోగులు డిమాండ్ చేశారు.

మరోవైపు మెగా డీఎస్సీ నోటిఫికేష‌న్ జారీ చేయాల‌ని డిమాండ్ చేశారు. గ్రూప్-2, 3 రాత‌ప‌రీక్ష‌ల‌ను డిసెంబ‌ర్ వ‌ర‌కు వాయిదా వేయాల‌ని, జీవో 46ను ర‌ద్దు చేయాల‌న్నారు. గురుకులాల్లోని బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఈ 6 డిమాండ్లను నిరుద్యోగులు పెట్టారు. నిరుద్యోగ సంఘాల జేఏసీ, అశోక్ చేపట్టిన మహాధర్నాకు బీఆర్ఎస్ పాల్గొని సంపూర్ణ మద్దతు ప్రకటించింది. నిరుద్యోగుల డిమాండ్లను వెంటనే పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా నిరుద్యోగులు హెచ్చరించారు.

Advertisement

Next Story