- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో గ్రూపు-1 దరఖాస్తు గడువు పొడిగింపు
దిశ, వెబ్‌డెస్క్: గ్రూపు-1 అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ శుభవార్త చెప్పింది. దరఖాస్తు గడువును మరోసారి పొడిగించింది. మరో రెండ్రోజుల పాటు పొడిగిస్తూ గురువారం సాయంత్రం టీఎస్‌పీఎస్‌సీ అధికారిక ప్రకటన చేసింది. కాగా, ఇవాళ్టితో దరఖాస్తు గడువు ముగిసింది. వెబ్‌సైట్ సహకరించక అప్లై చేసుకోవడం వీలుకాని అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు గడువు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. అయితే, 563 గ్రూపు-1 పోస్టుల భర్తీకి గత నెల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ.. ఇవాళ్టితో ముగియడంతో మరోసారి పొడిగించింది. ప్రిలిమినరీ పరీక్షను జూన్ 9వ తేదీన నిర్వహించనున్నట్లు కమిషన్ ఇటీవలే ప్రకటించింది. మెయిన్ పరీక్షలను ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో నిర్వహించనున్నట్లు వివరించింది. పరీక్షలకు వారం రోజుల ముందు నుంచి పరీక్ష సమయం కంటే 4 గంటల ముందు వరకు వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.