- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
భక్తులకు గొప్ప శుభవార్త!.. తమిళనాడు టూర్ కోసం ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ
దిశ, డైనమిక్ బ్యూరో: గురుపౌర్ణమి సందర్భంగా తమిళనాడులోని అరుణాచలేశ్వరుడి భక్తులకు తెలంగాణ ఆర్టీసీ గొప్ప శుభవార్త తెలిపింది. అరుణాచల స్వామితో పాటు తమిళనాడులోని పలు ఆలయాల సందర్శన కోసం ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీలో భాగంగా నాలుగు రోజుల పాటు పలు జిల్లాల నుంచి ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు తెలిపింది. ఈ మేరకు టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ లో తమిళనాడులోని అరుణాచలేశ్వరుడి గిరి ప్రదక్షిణ చేయాలనుకునే భక్తులకు శుభవార్త! అంటూ.. గురు పౌర్ణమి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం తెలంగాణలోని హైదరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, నల్లగొండ, వరంగల్, కరీంనగర్, కరీంనగర్, ఖమ్మం, మహబుబ్‌నగర్, తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను టీజీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసిందని అన్నారు. ఈ నెల 21న గురుపౌర్ణమి కాగా.. 19వ తేది నుంచి 22వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులను సంస్థ నడుపుతోందని స్పష్టం చేశారు. ఈ ప్యాకేజీలో కాణిపాక వరసిద్ది వినాయక స్వామితో పాటు శ్రీపురంలోని గొల్డెన్ టెంపుల్‌ను సందర్శించే సౌకర్యాన్ని కల్పించడం జరిగిందని తెలిపారు. ఇక అరుణాచల గిరి ప్రదక్షిణ ప్యాకేజీ బుకింగ్ కోసం http://tsrtconline.in వెబ్‌సైట్‌ను సందర్శించగలరని సజ్జనార్ ఎక్స్ వేదికగా వివరించారు.