పరేడ్ గ్రౌండ్‌లో రిపబ్లిక్ డే వేడుకలు.. జాతీయ జెండా ఆవిష్కరించిన గవర్నర్

by Gantepaka Srikanth |
పరేడ్ గ్రౌండ్‌లో రిపబ్లిక్ డే వేడుకలు.. జాతీయ జెండా ఆవిష్కరించిన గవర్నర్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌(Parade Ground)లో గణతంత్ర దినోత్సవ వేడుకలు(Grand Republic Day Celebrations) గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకలకు చీఫ్‌ గెస్ట్‌గా హాజరైన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Jishnu Dev Varma) జాతీయ జెండాను ఆవిష్కరించారు. పతాక ఆవిష్కరణకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సహా పలువురు మంత్రులు హాజరై అమరులకు నివాళులు అర్పించారు. జెండావిష్కరణకు ముందు గవర్నర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అంతకుముందు జూబ్లీహిల్స్‌లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి జెండాను ఆవిష్కరించారు. ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka), అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సచివాలయంలో సీఎస్ శాంతికుమారి జాతీయ జెండాను ఆవిష్కరించారు.

Next Story

Most Viewed