- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Gaddar Awards : ఏప్రిల్ లో గ్రాండ్ గా గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం : టీఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ చలనచిత్ర అవార్డులకు సంబంధించిన గద్దర్ అవార్డుల(Gaddar Awards) ప్రదానోత్సవం ఏప్రిల్ లో నిర్వహించనున్నట్టు టీఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు(TFDC Chiarman DilRaju) ప్రకటించారు. గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం, ఎంపికపై ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) విధివిధానాలు ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ వివరాలను నిర్మాత, టీఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు మీడియా సమావేశం నిర్వహించి వెల్లడించారు. ఉమ్మడి ఆంధప్రదేశ్ లో నంది అవార్డుల(Nandi Awards) పేరిట చలనచిత్ర పురస్కారాలు ఇచ్చే వారని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాడ్డాక ఈ కార్యక్రమం జరపలేదని తెలిపారు. ఈ క్రమంలో 2014 నుంచి 2023 వరకు విడుదలైన చిత్రాల్లో ప్రతి ఏడాదికి సంబంధించిన ఒక ఉత్తమ చిత్రానికి అవార్డు ఇస్తామని ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి కోరిక మేరకు హైదరాబాద్ ను ఇంటర్నేషనల్ హబ్ గా మార్చడానికి సినిమా రంగాన్ని కూడా అంతర్జాతీయస్థాయిలో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామని అన్నారు. అవార్డులకు పంపాల్సిన ఎంట్రీల నోటిఫికేషన్ ను విడుదల చేస్తున్నామని, వారం రోజుల్లో అన్ని ఎంట్రీలను తీసుకొని.. ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా పూర్తి చేసి, ఏప్రిల్ లో ఘనంగా అవార్డుల కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలియజేశారు. తెలంగాణ సినిమా రంగానికి విశేష సేవలనందించిన పైడి జయరాజ్(Paidi Jayaraj), కాంతారావు(KantaRao) పేర్లపై ప్రత్యేక అవార్డులు ఇవ్వాలని, ఇప్పటికే, ప్రముఖ నటులు ఎం. ప్రభాకర్ రెడ్డి పేరుపై ఉన్న ప్రజాదరణ పొందిన చలన చిత్రానికి అవార్డును కొనసాగిస్తూ... ఫీచర్ ఫిలిం కేటగిరిలో మొట్టమొదటి సారిగా ఉర్దూ భాషా చిత్రాలకు కూడా అవార్డులు ఇవ్వాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. గద్దర్ చలన చిత్ర అవార్డులకు సంబందించిన దరఖాస్తులు ఏ.సి గార్డ్స్ లోని తెలంగాణా చలన చిత్ర పరిశ్రమాభివృద్ది సంస్థ కార్యాలయంలో తేదీ.13. 3. 2025 నుండి అప్లికేషన్స్ అందుబాటులో ఉంటాయన్నారు.
ముఖ్య కేటగిరీలు ఇవే
*ఫీచర్ ఫిల్మ్స్
*జాతీయ సమైక్యతపై చలన చిత్రం
*బాలల చలన చిత్రం.
*పర్యావరణం/హెరిటేజ్/ చరిత్ర లపై చలన చిత్రం
*డెబిట్ ఫీచర్ ఫిల్మ్స్
*యానిమేషన్ ఫిలిం *సోషల్ ఎఫక్ట్ ఫిల్మ్స్
*డాక్యుమెంటరీ ఫిల్మ్స్
*షార్ట్ ఫిల్మ్స్
ఇతర కాటగిరీలు
*తెలుగు సినిమాలపై బుక్స్/ విశ్లేషణాత్మక వ్యాసాలు.
*ఆర్టిస్టులు/ టెక్నీషియన్లకు వ్యక్తిగత అవార్డులు
READ MORE ...