విద్యార్థులకు గుడ్ న్యూస్.. సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

by Gantepaka Srikanth |
విద్యార్థులకు గుడ్ న్యూస్.. సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలోని మూడు ఉమ్మడి జిల్లాల విద్యాసంస్థలకు ప్రభుత్వం శివరాత్రి(Maha Shivratri) మరుసటి రోజున సెలవు ప్రకటించింది. ఈనెల 27వ తేదీన టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల(MLC Elections) పోలింగ్ ఉన్న నేపథ్యంలో వరంగల్-ఖమ్మం-నల్లగొండ జిల్లాల్లోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటిస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లు(District Collectors) ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక బరిలో 19 మంది అభ్యర్థులు నిలిచారు. కరీంనగర్‌- మెదక్‌- నిజామాబాద్‌- ఆదిలాబాద్‌ గ్రాడ్యుయేట్‌ స్థానానికి 56 మంది, టీచర్‌ స్థానానికి 15 అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అయితే పోటీ మాత్రం ప్రధాన పార్టీల మధ్యే నెకొంది.

కరీంనగర్‌ గ్రాడ్యుయేట్‌ నియోజవకర్గంలో 3,41,313 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 2,18,060 మంది పురుషులు, 1,23,250 మంది మహిళలు, ఇతరులు ముగ్గురు ఉన్నారు. అదేవిధంగా కరీంనగర్‌ ఉపాధ్యాయ నియోజకవర్గంలో మొత్తం 25,921 మంది ఓట్లర్లు ఉన్నారు. నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గంలో 25,797 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 14,940 మంది పురుషులు, 9965 మంది మహిళలు ఉన్నారు. ఇవాళ సాయంత్రం 4:30 గంటలకు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారపర్వం ముగియడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటర్లను తమవైపునకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.



Next Story