- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రైతులకు సర్కార్ గుడ్ న్యూస్.. పంట భీమాపై వ్యవసాయ శాఖ కసరత్తు
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రకృతి వైఫరీత్యాలతో యేటా పంటలు నష్టపోతున్న రైతాంగాన్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పంట భీమా అమలుకు కసరత్తు ప్రారంభించింది. ఈ వానాకాలం సీజన్ నుంచే పథకాన్ని అమలుజేయాలని యోచిస్తోంది. ఇందుకోసం జిల్లా స్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు సైతం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వ్యవసాయ భూములు, సాగు చేసే పంటలు, లబ్ధి పొందే రైతులు తదితర వివరాలు సేకరించి నివేదికలు రూపొందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన పథకాన్ని రాష్ట్రంలోనూ అమలు చేయాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ప్రీమియం చెల్లింపు, బీమా పరిహారం తదితర విషయాలను ఇప్పటికే అమలవుతున్న రాష్ట్రాల్లో అధ్యయనం చేయించింది. రాష్ట్ర రైతుల ప్రయోజనం మేరకు ప్రీమియం కూడా ప్రభుత్వం చెల్లించాలని యోచిస్తోంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ ప్రక్రియ కాస్త మందగించగా ఎన్నికల కోడ్ అనంతరం వేగం పుంజుకుంది.
పంటల బీమాను గ్రామం, మండలం యూనిట్‌గా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒక గ్రామంలో ఎక్కువగా ఏ పంట సాగవుతోంది? ఎంత విస్తీర్ణం? .. వాతావరణ పరిస్థితులు.. ఇలా పలు అంశాలపై జిల్లా అధికారుల నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు వివరాలు సేకరిస్తున్నారు. అతివృష్టి, అనావృష్టి కారణంగా పంటలు నష్టపోయినా, చీడపీడల కారణంగా దిగుబడి తగ్గినా గ్రామం యూనిట్‌గా తీసుకొని పరిహారం అందించేందుకు ప్రభుత్వం విధివిధానాలను రూపొందిస్తోంది. మండలాల వారీ యూనిట్‌గా తీసుకొని బీమా చేయడంపై కూడా ఆలోచన చేస్తోంది. పంటల బీమాకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల కాగానే ఆసక్తి ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి బిడ్డింగ్‌లను ప్రభుత్వం ఆహ్వానించనుంది.
బిడ్డింగ్ దక్కించుకున్న కంపెనీకి రైతులు, వారు సాగు చేసిన పంటల వారీగా బీమా ప్రీమియం సొమ్మును చెల్లించనుంది. ఏడాదికి రెండు సీజన్లలోనూ పంటల బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించనుంది. ఫసల్ బీమా యోజన కింద హెకార్టుకు రూ.35 నుంచి రూ.70 వేల మొత్తానికి కేంద్ర ప్రభుత్వం బీమా చెల్లిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వమూ ఇదే విధానాన్ని అమలు చేయనుంది. రైతు వాటా కింద రూ. వెయ్యి నుంచి రూ.1600 వరకు ఉంటుంది. బీమా మొత్తంలో వానాకాలం పంటలకు 2 శాతం, యాసంగి పంటలకు 1.5 శాతం, ఏడాది కాలపరిమితి ఉన్న వాణిజ్య పంటలకు 5 శాతం ప్రీమియాన్ని రైతు చెల్లించాల్సి ఉండగా, దీనిని ప్రభుత్వమే చెల్లించనుంది.
Read More..
రూ.2 లక్షల రుణమాఫీకి క్రైటేరియా ఫిక్స్.. రూ.15 వేల కోట్లు సేవ్ చేసేలా రేవంత్ సర్కార్ ప్లాన్..!