గవర్నర్ అవార్డు ఫర్ ఎక్సలెన్స్-2024 జాబితా విడుదల.. ఎంపికైంది వీరే..

by D.Reddy |
గవర్నర్ అవార్డు ఫర్ ఎక్సలెన్స్-2024 జాబితా విడుదల.. ఎంపికైంది వీరే..
X

దిశ, వెబ్ డెస్క్: 'గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్‌-2024'ను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా అవార్డులకు ఎంపికైన 8 మంది జాబితాను విడుదల చేసింది. పర్యావరణ పరిరక్షణ, దివ్యాంగుల సంక్షేమం, క్రీడలు, సాంస్కృతిక విభాగాల్లో ఉత్తమ సేవలందిన వ్యక్తులు, సంస్థలకు ఈ అవార్డులను అందజేస్తారు. ఇక ఎంపికైన వారికి ఈ నెల 26న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అవార్డులను ప్రదానం చేయనున్నారు. అవార్డు కింద రూ.2 లక్షలు నగదు, జ్ఞాపికను ఇవ్వనున్నారు.

అవార్డులకు ఎంపికై వారు..

* దుశర్ల సత్యనారాయణ

* అరికపూడి రఘు

* పారా ఒలింపిక్ విజేత జీవాంజి దీప్తి

* ప్రొఫెసర్ ఎం.పాండురంగారావు, పి.బి.కృష్ణభారతికి సంయుక్తంగా ఎంపిక

* ధ్రువాంశు ఆర్గనౌజైషన్

* ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి

* ఆదిత్య మోహతా ఫౌండేషన్

* సంస్కృతి ఫౌండేషన్

Next Story

Most Viewed