- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Union Minister : ప్రభుత్వ పాఠశాలలను మరింత అభివృద్ధి చేయాలి
దిశ, సికింద్రాబాద్: ప్రభుత్వ పాఠశాలలపై వివక్ష చూపకుండా, వాటిని మరింత అభివృద్ది చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఓయూ క్యాంపస్ సమీపంలోని జామై ఉస్మానియా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు బెంచి లను పంపిణీ చేశారు. అనంతరం సీతాఫల్మండి ప్రభుత్వపాఠశాలకు ఏబీవీ ఫౌండేషన్ ప్రతినిధులు సహాకారంతో టాయిలెట్ క్లీనింగ్ మిషన్ ను అందజేశారు. ఈ కార్యక్రమాలకు కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నారని గుర్తు చేశారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాల కల్పన తో పాటు విద్యాబోధన కొనసాగాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రభుత్వ పాఠశాలలే దేశానికి పట్టుకొమ్మలు అని, రానున్న రోజుల్లో వాటిని మరింత పటిష్టం చేయాలన్నారు. దీంతో పేదవిద్యార్థులు మరింతా ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు మార్గం సుగమమం అవుతుందన్నారు. సమాజం అంతా ప్రభుత్వ స్కూళ్లను మెరుగుపర్చేలా బాధ్యత తీసుకోవాలని, అందుకు ప్రభుత్వాలతో పాటు స్వచ్చంద సంస్థలు తమ వంతు సహాయ సహాకారాలు అందించేందుకు ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా డీఈఏ రోహిణి, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు , విద్యార్థులు పాల్గొన్నారు.