HMDA పరిధిని విస్తరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

by Gantepaka Srikanth |   ( Updated:2025-03-12 17:18:52.0  )
HMDA పరిధిని విస్తరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
X

దిశ, వెబ్‌డెస్క్: హెచ్ఎండీఏ(Hyderabad Metropolitan Development Authority) పరిధి పెంచేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైన సంగతి తెలిసిందే. దీనిపై ఇటీవలే కేబినెట్ సమావేశం(Telangana Cabinet)లో సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకున్నారు. తాజాగా హెచ్ఎండీఏ పరిధిని విస్తరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మరో 11 జిల్లాలు, 104 మండలాలు, 36 రెవెన్యూ, 1355 గ్రామాలు, ఇలా మొత్తం 0 వేల 472.72 చదరపు కిలోమీటర్లు హెచ్ఎండీఏ(HMDA) పరిధిలోకి రానున్నాయి.

ఈ పరిధిని నివాస, వాణిజ్య, పారిశ్రామిక, రిక్రియేషన్, కన్జర్వేషన్‌ జోన్లుగా విడివిడిగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం పూనుకున్నది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని పక్కా ప్రణాళికతో అభివృద్ధి చేయడానికి సిద్ధమైంది. ఓఆర్‌ఆర్‌(ORR) నుంచి రీజినల్ రింగు రోడ్డు(RRR) వరకు వరకు ప్రజారవాణాకు పెద్దపీట వేయనున్నట్లు ఇప్పటికే అధికారులు తెలిపారు. రేడియల్‌ రహదారులు, గ్రిడ్‌ రహదారులకు ముందే మాస్టర్‌ప్లాన్‌లో ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నారు. ఆయా జోన్లకు అనుగుణంగా అక్కడ భూ కేటాయింపులు ఉంటాయని అధికారులు తెలిపారు. హెచ్‌ఎండీఏ పరిధి విస్తరణతో కొత్తగా చేరే మండలాల్లో భూముల ధరలకు రెక్కలు వస్తాయని తెలుస్తోంది. ఉత్తర్వుల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి : https://epaper.dishadaily.com/3985563/Tabloid/HMDA#page/1/1


Next Story

Most Viewed