ఉద్యోగుల్లో ఇళ్లు లేని వారికి ప్రభుత్వ భూమి మంజూరు చేయిస్తా!.. కాంగ్రెస్ అభ్యర్ధి బంపర్ ఆఫర్

by Ramesh Goud |
ఉద్యోగుల్లో ఇళ్లు లేని వారికి ప్రభుత్వ భూమి మంజూరు చేయిస్తా!.. కాంగ్రెస్ అభ్యర్ధి బంపర్ ఆఫర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: లోక్ సభ ఎన్నికల్లో భాగంగా రేపటి నుండి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ప్రారంభం అవుతున్న నేపధ్యంలో ఉద్యోగులకు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి బంపర్ ఆఫర్ ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల్లో సొంత ఇళ్లు లేని వారికి ప్రభుత్వ భూమి మంజూరు చేయించడం కోసం ప్రయత్నిస్తానని మెదక్ పార్లమెంట్ నియోజవర్గం కాంగ్రెస్ అభ్యర్ధి నీలం మధు ముదిరాజ్ హామీ ఇచ్చారు. సోషల్ మీడియా ద్వారా వీడియో విడుదల చేసిన ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగ ఉపాధ్యాయ ఆర్టీసీ కార్మిక పోలీస్ ఉద్యోగులకు నమస్కారం తెలియజేశారు.

అనేకమంది ఉపాధ్యాయులు ఆర్టీసీ కార్మికులు పోలీసు వారు 30 సంవత్సరాలు సర్వీస్ చేసిన వారిలో సొంత ఇల్లు అనేటువంటిది లేనివారు చాలామంది ఉన్నారని అన్నారు. అలాంటి వారి కోసం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో మీకు ఎక్కడైతే ఓటు హక్కు ఉంటుందో ఆ ప్రాంతంలో మీరు కోపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసుకున్నట్లయితే ప్రభుత్వంతో మాట్లాడి బహుళ అంతస్తులమేడలు కట్టడం కోసం భూమిని మంజూరు చేయించడం కోసం తాను ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. అలాగే రేపటి నుండి పొస్టల్ బ్యాలెట్ సదుపాయం ప్రారంభం అవుతున్న నేపధ్యంలో నియోజకవర్గ ఉద్యోగులందరూ చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధినైన తనను ఆశీర్వధించాలని నీలం మధు కోరారు.


Advertisement

Next Story

Most Viewed