తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. రెండు రోజుల పాటు భారీ వర్షాలు

by Mahesh |
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. రెండు రోజుల పాటు భారీ వర్షాలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు సకాలంలో ప్రవేశించినప్పటి, రైతులతో మాత్రం వర్షాలు దోబుచులాడుతున్నాయి. కొన్ని జిల్లాల్లో నల్లటి మేఘాలు పట్టినప్పటికీ వర్షాలు మాత్రం పడటం లేదు. దీంతో పూర్తిగా వర్షాల పై ఆదారపడిన రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రైతులకు హైదరాబాద్ వాతావరణ శాఖ శుభవార్త అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ముఖ్యంగా వరంగల్, మహబూబాబాద్, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని, ఆ సమయంలో గంటలకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. పైన జిల్లాలకు వాతావరణ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కాగా శనివారం రాత్రి నుంచి తెలంగాణలోని పలు జిల్లాల్లో తుఫాన్ మాదిరిగా చిరు జల్లులు కురుస్తున్నాయి. రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.

Next Story

Most Viewed