- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వృద్ధులకు, దివ్యాంగులకు తీపికబురు.. ఇంటి వద్దే ఆధార్ నమోదు..!
దిశ, వెబ్‌డెస్క్: వృద్ధులు, దివ్యాంగులు, వయోవృద్ధులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. మంచానికే పరిమితమైన రోగులకు ఇంటివద్దే ఆధార్ నమోదు చేయనున్నారని ఈ మేరకు కేంద్రం రాష్ట్రాలకు మార్గదర్శకాలు పంపించడం జరిగింది. సంక్షేమ పథకాలు, ఇతర అవసరాలకు ఆధార్ తప్పనిసరి కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దివ్యాంగులు, వృద్ధులు ఈ-మెయిల్ ద్వారా UIDAI(యూఐడిఏఐ) కు సమాచారం పంపిస్తే వారం రోజుల్లో ఇంటికి వెళ్లి వారి వివరాలను నమోదు చేస్తారు.
ఒక అడ్రస్ లో ఉన్న మొదటి వ్యక్తికి 700 రూపాయలు, ఆ తర్వాత ప్రతి ఒక్కరికి రూ.350 వసూలు చేస్తారు. మరో విషయమేంటంటే.. ఓటర్ కార్డుతో ఆధార్ లింక్ చేసే కార్యక్రమం ఇంకా ప్రారంభించలేదని, ఈ ప్రక్రియను ముగించడానికి నిర్ణీత గడువును కూడా నిర్ణయించలేదని, ఓటర్ కార్డుతో ఆధార్ లింక్ లేని వారి పేర్లను ఓటర్ లిస్ట్ నుంచి తీసివేయమని తెలంగాణ కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు స్పష్టం చేశారు. అలాగే ఓటర్ కార్డుతో ఆధార్ లింక్ చేయడం వల్ల నకిలీ ఓట్లను గుర్తించవచ్చని ఈసీ(EC) భావిస్తోంది.