- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు

దిశ, వెబ్ డెస్క్: వేసవి ప్రారంభం నుంచే ఎండలు మండుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ (Telangana) రాష్ట్ర విద్యాశాఖ పాఠశాల విద్యార్థులకు (Students) గుడ్ న్యూస్ చెప్పింది. ఈనెల 15 నుంచి ఒంటి పూట బడులు (Half day schools) నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ స్కూళ్లు ఉదయం 8 గంటలకు ప్రారంభమై.. మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు జరగుతాయి. ఏప్రిల్ 23 వరకు ఇలాగే స్కూళ్ల టైమింగ్స్ కొనసాగుతాయి. 10వ తరగతి పరీక్షలు జరిగే స్కూళ్లలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలోనూ ఎండల తీవ్రంగా నానాటికీ పెరుగుతుంది. దీంతో మార్చి 15 నుంచి ఒంటి పూట బడులు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే ప్రణాళికలు కూడా సిద్ధం చేసినట్లు సమాచారం.
ఇక ఆ తర్వాత వేసవి సెలవులను ప్రకటించనుంది. ఈ వేసవి సెలవులు ఏప్రిల్ 23 నుంచి జూన్ 11 వరకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. జూన్ 12 నుంచి 2025-26 విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది.