- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గొర్రెల పెంపకదారులకు గుడ్ న్యూస్
దిశ, తెలంగాణ బ్యూరో: గొర్రెల పెంపక దారులకు సర్కార్ గుడ్న్యూస్తెలిపింది. గడ్డి విత్తనాలపై సబ్సిడీ ఇవ్వనున్నది. సొంత భూముల్లో పశుగ్రాసం పెంపునకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ఈ మేరకు శనివారం మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్బీఆర్కే భవన్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గొర్రెల పంపిణీని మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేస్తోందన్నారు.
ఇప్పటి వరకు 7.31 లక్షల మంది గొర్రెల పెంపకదారులను అర్హులుగా గుర్తించామని, మొదటి విడతలో 50 శాతం మంది లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లు పంపిణీ చేశామన్నారు. మిగిలిన వారికి 2 వ విడతలో పంపిణీ చేస్తామన్నారు. గొర్రెల రవాణాకు జీపీఎస్ సౌకర్యం తో కూడిన వాహనాలను ఉపయోగిస్తామన్నారు. రాష్ట్రంలో పెరిగిన గొర్రెల సంపదకు అనుగుణంగా దాణా కొరత లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.