- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సొంతజాగ ఉన్నవారికి గుడ్ న్యూస్.. ఈసారి బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయింపు
దిశ, తెలంగాణ బ్యూరో : ఈబడ్జెట్‌లో జనాకర్షన పథకాలకే పెద్దపీట వేస్తున్నారు. ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్ కావడంతో ఎక్కువ నిధులు గృహ నిర్మాణానికి కేటాయించనున్నారు. సొంతంగా ఇంటి జాగ ఉన్నవారు ఇళ్లు నిర్మించుకునేందుకు రూ.3 లక్షలు ఇచ్చేలా కార్యచరణను రూపొందిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో దీన్ని అస్త్రంగా వాడుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే విధివిధానాలపై ఆర్ అండ్ బీ శాఖ అధికారులతో సంప్రదింపులు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఈ బడ్జెట్ రూపకల్పన కీలకం కానుంది. ఆ దిశగా కేసీఆర్ బడ్జెట్ పై ప్రత్యేక దృష్టిసారించారు. ఇళ్ల జాగ ఉన్నవారికి రూ.5 లక్షలు ఇంటి నిర్మాణం కోసం ఇస్తామని 2018 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు. అయితే అది అమల్లోకి రాలేదు. ఇంతవరకూ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఈ హామీ ఇచ్చినప్పటి నుంచి నాలుగు బడ్జెట్లను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఏ బడ్జెట్లోనూ ఇంటి నిర్మాణ సాయం కోసం నిధులు కేటాయించలేదు. గతేడాది మార్చిలో నిర్వహించిన బడ్జెట్ సమావేశాల్లో రూ.3 లక్షలు ఇస్తామని ప్రకటించారు. 4లక్షల మందికి ఇస్తామని ప్రకటించారు. నియోజకవర్గానికి 3వేల ఇళ్ల చొప్పున కేటాయిస్తున్నట్లు బడ్జెట్ సమావేశాల్లో మంత్రి హరీష్ రావు ప్రకటించారు. అయినా అతీగతీ లేకుండాపోయింది.
అయితే ఈసారి బడ్జెట్ ఎన్నికలకు కీలకం కావడంతో జనాకర్షణ పథకాలకు ఎక్కువ నిధులు కేటాయించాలని కేసీఆర్ అందుకు సంబంధించిన ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అందులో భాగంగా సొంత జాగా ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి 3లక్షలు విధిగా ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. అందుకోసం ఆర్ అండ్బీ శాఖ అధికారులతో కేసీఆర్ సంప్రదింపులు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ బడ్జెట్ లో ఆర్అండ్ బీశాఖకు 36 వేలకోట్ల నుంచి 40 వేల కోట్లు కేటాయించే అవకాశం ఉందని సమాచారం. సొంత జాగల్లో ఇండ్లు కట్టుకునే లబ్ధిదారుల ఎంపికకు ప్రభుత్వం గైడ్ లైన్స్‌ను రూపొందిస్తున్నట్లు తెలిసింది. అయితే ఎప్పటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభిస్తారో బడ్జెట్ సమావేశాల్లోనే ప్రభుత్వం క్లారిటీ ఇవ్వనుంది. అంతేగాకుండా నియోజకవర్గానికి ఎన్ని ఇళ్లు కేటాయిస్తారు... గ్రామానికి ఎన్నిఇళ్లు ఇస్తారనేది చర్చనీయాంశమైంది.
తెలంగాణ ప్రభుత్వం 2014 ఆగస్టు 19న సమగ్ర కుటుంబ సర్వేను నిర్వహించింది. ఇందులో 91.38 లక్షల కుటుంబాలు ఉన్నట్లు గుర్తించగా.. అందులో 45.02 లక్షల కుటుంబాలు సింగిల్ రూముల్లోనే నివాసం ఉంటున్నట్లు వెల్లడైంది. 24,58,381 కుటుంబాలు కిరాయి ఇండ్లలో ఉంటుండగా.. స్లమ్స్, ప్రభుత్వ స్థలాల్లో మరో 3,24,312 కుటుంబాలు తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని, మొత్తంగా27.82 లక్షల కుటుంబాలకు సొంతిండ్లు లేవని వెల్లడైంది. ఈ ఏడేండ్లలో ఆ సంఖ్య 32 లక్షలు అయి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రజలు సైతం ఏళ్ల తరబడి డబుల్ ఇళ్లకోసం ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే కేసీఆర్ కు ఆర్ అండ్ బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నమ్మకస్తుడు. అయితే మొన్నటివరకు గృహ నిర్మాణశాఖ, ఆర్ అండ్ బీ శాఖలు వేర్వురుగా విధులు నిర్వహించేవి. అయితే ఆర్ అండ్ బీశాఖలో గృహ నిర్మాణశాఖను విలీనం చేసింది. ప్రజలకు ఇళ్ల నిర్మాణం కోసం ఇచ్చే నిధులు పక్కదారి పట్టకుండా ఉండేందుకే ప్రశాంత్ రెడ్డికి బాధ్యతను అప్పగించినట్లు సమాచారం.
అసెంబ్లీ ఎన్నికల్లో ఇంటిజాగ ఉన్నవారికి రూ.3లక్షలు ఇంటి నిర్మాణానికి మంజూరును అస్త్రంగా వినియోగించుకోనుంది. గత ప్రభుత్వాలు పేదలకు ఇంటి నిర్మాణం కోసం ఇచ్చిన డబ్బులను, ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చే డబ్బులను బేరీజు వేస్తూ ప్రచారం చేయనున్నట్లు సమాచారం. డబుల్ బెడ్రూం ఇళ్లు పూర్తిస్థాయిలో పేదలకు అందకపోవడంతో దీంతోనైనా ప్రజలకు చేరువకావాలని భావిస్తున్నారు. అదే విధంగా పెండింగ్ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు, విద్య, వైద్యానికి సైతం ఎక్కువ బడ్జెట్ ను పెట్టి జాతీయ రాజకీయాల్లోకి సైతం ఈ అంశాలను ప్రచారం చేయాలని, తెలంగాణ ప్రభుత్వం ప్రజాసంక్షేమకోసం పాటుపడుతుందనే అంశాన్ని వివరించేలా ప్లాన్ చేస్తుంది. ఏదీ ఏమైనప్పటికీ రాబోయే ఎన్నికల్లో ప్రజలను ఆకర్షించే పథకాలకే ఈ బడ్జెట్ లో కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని ప్రగతిభవన్ వర్గాలు పేర్కొంటున్నాయి.