Telangana Rythu Runa Mafi: రైతులకు గుడ్ న్యూస్.. రూ.2 లక్షల రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

by Prasanna |   ( Updated:2023-12-12 05:31:07.0  )
Telangana Rythu Runa Mafi:  రైతులకు గుడ్ న్యూస్.. రూ.2 లక్షల రైతు రుణమాఫీపై సీఎం రేవంత్  కీలక ఆదేశాలు
X

దిశ,వెబ్ డెస్క్: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు మెుదలుపెట్టింది. ఇప్పటికే మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ సౌకర్యం కల్పిస్తున్నారు. రైతులకు రూ.2 లక్షల మేరకు రుణమాఫీపై సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. రుణమాఫీపై కార్యాచరణ ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో ఆయన రైతుభరోసాపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రుణమాఫీపై అధికారుల నివేదిక అనంతరం ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలో ఏ ఒక్క రైతుకూ ఇబ్బంది కలగకుండా పంట పెట్టుబడి సాయం అందించాలని సీఎం రేవంత్ సూచించారు. గత ప్రభుత్వ హయాంలో రైతుబంధు పథకం కింద అయిదు, పది ఎకరాల్లోపు వారికి ఎంతెంత అందించారో స్పష్టమైన సమాచారం ఇవ్వాలని సీఎం అధికారులకు సూచించారు. అన్నదాతలకు తమ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా చెప్పారు.సీఎం ఆదేశాల మేరకు సోమవారం రాత్రి నుంచి రైతుబంధు నిధుల విడుదలను అధికారులు ప్రారంభించారు. 70 లక్షల మంది రైతులకు రూ.7 వేల కోట్ల మేరకు చెల్లింపులు జరుగుతాయని అధికారులు చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed