- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జీహెచ్ఎంసీ టు జన్వాడ? గుట్టుగా కదులుతున్న గులాబీ ఫైళ్లు..!
దిశ, సిటీ బ్యూరో : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజే మున్సిపల్ శాఖలో మరోసారి గులాబీ పాలన బయటపడింది. ఏడాది లోపల మళ్లీ అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేల చేస్తున్న వాదనలకు బలం చేకూరింది. జీహెచ్ఎంసీలో ఏళ్ల తరబడి తిష్ట వేసిన ఆంధ్రా అధికారులు గులాబీ పార్టీకి వత్తాసు పలికిన అధికారుల పదవీ కాలాన్ని కొనసాగించేందుకు గుట్టు చప్పుడు కాకుండా ఫైళ్లను మూవ్ చేస్తున్నట్టుగా విశ్వసనీయ సమాచారం.
అజ్ఞాతంలో ఉన్న అధికారులకు, జన్వాడకు జీహెచ్ఎంసీ ఫైళ్లు వెళ్తున్నట్లు సమాచారం. కొందరు మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు అందినంత దండుకొని పదవీ కాలాన్ని పొడిగిస్తున్నట్టు తెలుస్తున్నది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన కొందరు అధికారులతో గురువారం మధ్యాహ్నం నుంచి రహస్యంగా కలిసి ఈ ప్రక్రియను చేపట్టినట్టు సమాచారం.
రహస్య సమావేశం..
రిటైర్డ్ అయ్యి జీహెచ్ఎంసీలో వివిధ హోదాల్లో కొనసాగుతున్న అధికారులకు సంబంధించిన పదవీ కాలాన్ని గుట్టుచప్పుడు కాకుండా పొడగింపు చేసుకునేందుకు పరిపాలన విభాగంలో బుధవారం జోనల్ కమిషనర్లు రహస్యంగా సమావేశమైనట్లు సమాచారం. ఫైనాన్స్, హౌసింగ్, టౌన్ ప్లానింగ్ విభాగాల్లో కొనసాగుతున్న రిటైర్డ్ అధికారుల పదవీ కాలాన్ని ఎక్స్ టెండ్ చేసుకునేందుకు వీలుగా అజ్ఞాతంలో ఉన్న అధికారులకు జీహెచ్ఎంసీ అడ్మిన్ సెక్షన్ నుంచి ఫైళ్లు వెళ్లినట్లు తెలిసింది. ఈ విషయంపై జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ చూసీ చూడనట్లు వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది.
సీఎం స్పందించకుంటే అంతే..
కొత్తగా అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఎవరో తెలుసుకునేందుకు సమయం పడుతుందని ఆ తర్వాత మున్సిపల్ మంత్రి ఎవరో తేలేందుకు చాలా టైం పట్టొచ్చని భావించి ఈ బాగోతానికి తీరదీసినట్లు తెలుస్తున్నది. రేవంత్ రెడ్డి ఈ విషయంపై సీరియస్‌గా స్పందించకపోతే రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు రాజకీయ అవకాశవాదుల చేతిలో తలకిందులయ్యే ప్రమాదం పొంచి ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతుంది.