- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేపే ఆదివారం.. చికెన్, మటన్ షాపులు బంద్
by GSrikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్‌లోని మాంసం దుకాణా దారులకు జీహెచ్‌ఎంసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. జైన మత ప్రచారకుడు మహావీర్ జయంతి సందర్భంగా మాంసం దుకాణాలు బంద్ చేయాలని జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొన్నారు. చికెట్, మటన్, ఫిష్ అమ్మకాలను నిషేధించింది. ఎవరైనా ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు హైదరాబాద్ మహా నగరంలో జైనుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నారని.. వారి కోసం ఆదివారం గ్రేటర్ వ్యాప్తంగా మాంసం షాపులు బంద్ చేయడం ఏంటని మాంసం ప్రియులు ప్రశ్నిస్తున్నారు. అయితే, మహావీర్ జయంతిని జైనులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఆ రోజున ఎలాంటి జీవహింస చేయరు. ఈ క్రమంలోనే మాంసాహారం బంద్‌కు పిలుపునిచ్చారు. జైనుల సంప్రదాయాన్ని గౌరవిస్తూ మార్కెట్లతో పాటు మాంసం షాపులు కూడా బంద్ చేయాలని జీహెచ్ఎంసీ ఆదేశాలు జారీ చేసింది.
Advertisement
Next Story