- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
చెంబులోంచి డబ్బులు కురుస్తాయని ఘరానా మోసం.. ఎక్కడంటే?
by Sathputhe Rajesh |

X
దిశ, వెబ్‌డెస్క్: చెంబులోంచి డబ్బులు కురుస్తాయని నమ్మంచి ఓ వ్యక్తి ఏకంగా రూ. 21లక్షలు కాజేశాడు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా వెల్జర్లకు చెందిన మహేష్, మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం మల్లాపూర్ కు చెందిన వివేకానందగౌడ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. వీరికి హైదరాబాద్ లో నంద్యాల జిల్లాకు చెందిన రంగస్తామి పరిచయమయ్యాడు. పూజలు చేసిన చెంబు ఇస్తానని, దాంట్లోంచి డబ్బులు కురుస్తాయని నమ్మించి మహేష్, వివేకానంద నుంచి రూ.21లక్షలు కాజేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Next Story