Ganta: వాళ్ల వీడియోలు తీసే అధికారం మీకెక్కడిది..? ప్రొ. ఘంటా చక్రపాణి ఫైర్

by Ramesh Goud |   ( Updated:2024-11-10 12:08:14.0  )
Ganta: వాళ్ల వీడియోలు తీసే అధికారం మీకెక్కడిది..? ప్రొ. ఘంటా చక్రపాణి ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: కులగణన సర్వే(Caste Survey) కోసం వస్తున్న వాళ్ల వీడియోలు తీసే అధికారం మీకెక్కడిదని టీజీపీఎస్సీ మాజీ చైర్మన్ ప్రొ.ఘంటా చక్రపాణి(Prof. Ghanta Chakrapani) అన్నారు. కులగణన(Caste Census) కోసం వస్తున్న వారిని నిలదీస్తున్న ప్రజలు అంటూ సామాజిక మాధ్యమాల్లో కొందరు వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. నెటిజన్లపై ఫైర్ అయ్యారు. ఇలాంటి వీడియోలు చాలా మంది షేర్ చేస్తున్నారని, ఈ సర్వే కోసం వస్తున్న వాళ్లు నాయకులో కార్యకర్తలో కాదని. సాధారణ ఉద్యోగులు(Regular Employees), వాలంటీర్ల(Volunteers)ని చెప్పారు. అలాగే వాళ్లు విధి నిర్వహణలో ప్రభుత్వ నిర్ణయం ప్రకారం వివరాలు సేకరించడానికి వచ్చారు తప్ప మీ ఇంటికి బిచ్చం ఎత్తుకోవడానికి కాదని, వాళ్ల ఫోటోలు, వీడియోలు తీసే అధికారం మీకెక్కడిదని మండిపడ్డారు.

ఈ వీడియోలో ఆ ఉద్యోగిని వెంటాడి వీడియోలో బంధిస్తున్న ఆ మహిళ మాత్రం తన ఐడెంటిటీ ని కాపాడుకుంటోందని అన్నారు. మీకు నిజంగానే నిజాయితీ ఉంటే మీ విమర్శను మీరే స్వయంగా వీడియో చేసి పెట్టాలని, లేదా మీకు కులగణన పట్ల ఆసక్తి లేకుంటే లేదని చెప్పాలని కోరారు. అంతే తప్ప వీడియోలు ఆన్ చేసి విధి నిర్వహణలో ఉన్న మహిళలను ఇబ్బంది పెట్టడం, దాన్ని సోషల్ మీడియా లో షేర్ చేయడం నేరమని తెలిపారు. ఇక ఇతరుల ప్రైవసీకి ఆటంకం కలిగించడంతో పాటు విధులకు ఆటంకం కలిగించడం కూడా నేరమేనని స్పష్టం చేశారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకుని ఉద్యోగులకు, క్షేత్ర స్థాయి సిబ్బందికి రక్షణ కల్పించాలని, వారి గౌరవాన్ని కాపాడాలని ప్రభుత్వాన్ని(Government), తెలంగాణ డీజీపీ(DGP of Telangana)ని కోరారు. అంతేగాక విధుల్లో ఉన్న క్షేత్రస్థాయి సిబ్బంది గోప్యత, గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చక్రపాణి అన్నారు.

Advertisement

Next Story