- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గంజాయి గ్యాంగ్ అరెస్ట్.. విచారణలో వెలుగులోకి షాకింగ్ విషయాలు
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో, లంగర్ హౌస్ పోలీసులు కలిసి ఆరుగురు సభ్యుల గంజాయి గ్యాంగ్‌ను అరెస్ట్ చేసారు. నిందితుల నుంచి 44 కిలోల గంజాయి, నాలుగు కార్లు, 8 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో ఓ కానిస్టేబుల్ ఉండటం గమనార్హం. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన వీరన్న, అజ్మీరా, మనోజ్, మధు, ప్రశాంత్ నాయక్ తేజావత్, మహబూబ్ నగర్‌కు చెందిన మొహమ్మద్ జహంగీర్‌లు స్నేహితులు. వీరిలో ప్రశాంత్ నాయక్ తేజావత్ టీఎస్ స్పెషల్ పోలీస్‌కు చెంది గ్రే హౌండ్స్‌లో అటాచ్ మెంట్‌పై పని చేస్తున్నాడు.
ప్రధాన సూత్రదారి ఇతనే..
ఈ గ్యాంగ్ లో వీరన్న ప్రధాన సూత్రధారి అని సీపీ ఆనంద్ చెప్పారు. 2006లో ఎస్ఎస్సీ పరీక్షల్లో ఫెయిల్ అయిన వీరన్న ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి ఓయూ హాస్టల్‌లో ఉంటున్న బంధువు గదిలో షెల్టర్ తీసుకున్నట్టు తెలిపారు. 2009లో ఎస్ఎస్సీ పూర్తి చేసి 2013లో అన్నమాచార్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఈఈఈ సబ్జెక్టులో డిప్లొమా చదివాడని చెప్పారు. అనంతరం సికింద్రాబాద్‌లోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో క్రెడిట్ కార్డు విభాగంలో పని చేసాడన్నారు. జీతం తక్కువగా ఉండటంతో అది మానేసి ఆర్కేపురంలోని నారాయణ ఈ టెక్నో స్కూల్లో ఉద్యోగం చేసినట్టు తెలిపారు. అయినా ఆశించినంత ఆదాయం రాకపోవటంతో గంజాయి దందా మొదలు పెట్టినట్టు వివరించారు.
సీలేరు, మహారాష్ట్రలోని మల్కాన్‌గిరి ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయి తెచ్చి సూర్యాపేటలో ఉంటున్న బంధువు తేజావత్ చందా ద్వారా అమ్మించేవాడని చెప్పారు. వృద్దాప్యం కారణంగా చందా దందా నుంచి తప్పుకోగా నిఖిలేష్ అనే వ్యక్తి ద్వారా గంజాయి అమ్మకాలు జరిపిస్తూ వస్తున్నాడని చెప్పారు. ఖరీదైన కార్లు కొని హైదరాబాద్ ఆటోనగర్‌లో వాటిల్లో ప్రత్యేక బాక్సులు ఏర్పాటు చేయించుకొని గంజాయి తరలించేవాడని తెలిపారు. ముఠాలోని మిగతా సభ్యులను డ్రైవర్లుగా పెట్టుకున్నాడని పేర్కొన్నారు. ఓ కారుకు పోలీస్ సైరన్ పెట్టుకొని ఎవ్వరూ పట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నాడని వివరించారు. ఇలా సంపాదించిన డబ్బును వైన్ షాపుల్లో, సూపర్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసాడన్నారు. స్వగ్రామంలో విలాసవంతమైన భవనాన్ని కట్టుకున్నట్టు చెప్పారు. పక్కాగా అందిన సమాచారం మేరకు గ్యాంగ్‌ను అరెస్ట్ చేసినట్టు చెప్పారు.
- Tags
- crimenews