RTC బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ.. ఇవాళ మార్గదర్శకాలు

by GSrikanth |   ( Updated:8 Dec 2023 3:54 AM  )
RTC బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ.. ఇవాళ మార్గదర్శకాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రేపటి నుంచి ఆర్టీసీలో మహిళలందరికీ ఉచిత రవాణా సౌకర్యం కల్పించనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీల్లో మొదట ఆర్టీసీ ఉచిత జర్నీ, రాజీవ్ ఆరోగ్య శ్రీ రూ.10 లక్షలకు పెంపు అంశాలను అమలు చేయాలని క్యాబినేట్ నిర్ణయించిందన్నారు. శుక్రవారం మరోసారి సీఎం అధ్యక్షతన ఈ రెండు గ్యారంటీల మార్గదర్శకాలను ఫైనల్ చేయనున్నట్లు తెలిపారు.

సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఈ రెండిండినీ తొలుత అమలు చేస్తామన్నారు. సోనియా గాంధీ ఆదేశాలతోనే ఆరు గ్యారంటీలను అమలు చేయబోతున్నట్లు వెల్లడించారు. ఇక ఈ నెల 9న అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించి ప్రోటెం స్పీకర్ సహకారంతో స్పీకర్, ఫ్యానెల్ ను ఎంపిక చేస్తామన్నారు.నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే ప్రమాణ స్వీకరణ కార్యక్రమాలను పూర్తి చేస్తామన్నారు. కాగా, ఈ నెల 9వ తేదీ నుంచి మహిళలంతా ఆధార్ కార్డు చూపించి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు.

Read More..

ఉచిత బస్సు ప్రయాణం కేవలం వారికే వర్తించనుందా?

Next Story

Most Viewed