NIMS: నిమ్స్ కు 'యూకే' వైద్య బృందం.. ప్రత్యేకంగా 'వారి కోసం' ఉచిత గుండె శస్త్ర చికిత్సలు!

by Geesa Chandu |   ( Updated:2024-09-14 18:52:21.0  )
NIMS: నిమ్స్ కు యూకే వైద్య బృందం.. ప్రత్యేకంగా వారి కోసం ఉచిత గుండె శస్త్ర చికిత్సలు!
X

దిశ, వెబ్ డెస్క్: గుండె సంబంధ సమస్య(Cardiovascular problems)లతో బాధపడుతున్న చిన్నారులకు(Childrens) యూకే వైద్య బృందం(UK medical team) శుభవార్త తెలిపింది.రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో చిన్నారులకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు.. యూకే వైద్యులు నిమ్స్ హాస్పిటల్(NIMS Hospital) కు రానున్నట్లు నిమ్స్ హాస్పిటల్ సంచాలకులు డాక్టర్ బీరప్ప ఒక ప్రకటనలో వెల్లడించారు.

అయితే, యూకే(UK) లో స్థిరపడిన డాక్టర్ రమణ దన్నపనేని ఆధ్వర్యంలోని వైద్య బృందం.. ప్రతి సంవత్సరం వారం రోజుల పాటు నిమ్స్ భాగస్వామ్యంతో గుండె సంబంధిత సమస్యలతో బాధ పడుతున్న చిన్నారులకు ఉచితంగా శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నారు. ఎవరైతే ఆర్ధిక ఇబ్బందులతో తమ చిన్నారులకు గుండె శస్త్ర చికిత్స చేయించుకోలేక ఇబ్బంది పడుతున్నారో.. ప్రత్యేకంగా వారి కోసమే ఉచితంగా వైద్యం అందించనున్నారు. ఈ నెల 22 నుండి 28 వరకు హైదరాబాద్ లోని నిమ్స్(NIMS) లో ఉచిత గుండె శస్త్ర చికిత్సలు నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా నిమ్స్ సంచాలకులు బీరప్ప మాట్లాడుతూ.. "గుండెకు రంధ్రం, ఇతర గుండె సమస్యలతో బాధపడుతున్న చిన్నారులు ఉచిత వైద్య సేవలు పొందవచ్చని తెలిపారు. యూకే వైద్య బృందంతో పాటు నిమ్స్ కార్డియో థొరాసిక్ విభాగాధిపతి ప్రొఫెసర్ అమరేశ్వరరావు, ఇతర సీనియర్ వైద్యులు ఈ శస్త్ర చికిత్సలు నిర్వహించనున్నట్లు ఆయన అన్నారు. కాగా గుండె సంబంధిత ఉచిత వైద్య సేవలను పొందాలనుకునేవారు పంజాగుట్ట నిమ్స్ లోని కార్డియో థొరాసిక్ వైద్యులను సంప్రదించాలి" అని డాక్టర్ బీరప్ప వెల్లడించారు.

Advertisement

Next Story