ఉచిత బస్సు తప్పా.. ఏ హామీ అమలు కాలే: ప్రభుత్వంపై మోత్కుపల్లి ఘాటు వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2024-07-11 09:32:23.0  )
ఉచిత బస్సు తప్పా.. ఏ హామీ అమలు కాలే: ప్రభుత్వంపై మోత్కుపల్లి ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఉచిత బస్సు పథకం తప్ప. ఏ ఒక్క హామీ అమలు కాదేంటూ మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిరుద్యోగుల బాధలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమని అన్నారు. కష్టకాలంలో వారిని ఆదుకోవాల్సింది పోయి ముళ్ల కంచెలతో నిర్భంధించి కొడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే రానున్న రోజుల్లో పార్టీ కనుమరుగు అవ్వడం ఖాయమని అన్నారు. ప్రభుత్వంపై చెడ్డపేరు రాకముందే ప్రజా సమస్యలపై ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. తాను నిజాయితీగా, నిఖ్ఖచ్చిగా ఉన్నందుకే తనకు పోయిన ఎన్నికల్లో టికెట్ రాలేదంటూ మోత్కుపల్లి కామెంట్ చేశారు. తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డితో సమానంగా అన్ని ప్రభుత్వం ప్రకటనపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఫొటో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed