ఉగ్రదాడి మనకు అదే సూచిస్తుంది.. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ సంచలన వ్యాఖ్యలు

by Ramesh Goud |
ఉగ్రదాడి మనకు అదే సూచిస్తుంది.. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఉగ్రవాదం అనేది ప్రపంచానికే ముప్పు అని, దీనిని ఐక్యంగా ఉండి ఎదుర్కొవాలని పహల్గామ్ ఉగ్రదాడి సూచిస్తుందని ఉపరాష్ట్రపతి జగదీప్ దన్ఖర్ (Vice President Of India Jagadeep Dankhar) అన్నారు. ఈ మేరకు ఓ కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన మాటలను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. అమాయకుల ప్రాణాలను బలిగొన్న పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror Attack) పట్ల సంతాపం తెలియజేయడంతో పాటు ఆగ్రహావేశాలు వెల్లగక్కడంలో కూడా తాను దేశంతో కలిసి నడుస్తానని అన్నారు.

అలాగే ఉగ్రవాదం అనేది ప్రపంచ ముప్పు (global menace) అని, దీనిని ప్రజలంతా ఐక్యంగా ఉండి ఎదుర్కొవాలని పిలుపునిచ్చారు. అంతేగాక భారతదేశం ప్రపంచంలోనే అత్యంత శాంతిని కోరుకునే దేశమని, ఇలాంటి వసుధైక కుటుంబంలో ప్రతిబింబించే మన నాగరికత, నైతికత ప్రపంచ దేశాలలో ప్రతిధ్వనిస్తుందని అన్నారు. దేశ ప్రయోజనాలే అత్యున్నతమైనవని డా. బీఆర్ అంబేద్కర్ (Dr. BR Ambedkar) రాజ్యంగ పరిషత్ లో తన చివరి ప్రసంగంలో చెప్పారని తెలిపారు.

అంబేద్కర్ ప్రకారం దేశాన్ని ఎల్లప్పుడు మొదటి స్థానంలో ఉంచాలనే సంకల్పం తీసుకోవాలని, జాతీయ ప్రయోజనాలను పక్షపాత ప్రయోజనాలతో ముడి పెట్టడం సాధ్యం కాదని, ఇది రాజకీయంగా.. ఒక వ్యక్తికి గానీ ఒక సమూహానికి గానీ లోబడి ఉండదని చెప్పారు. మూడో సారి ప్రధాని (Prime Minister) అయిన దార్శనికుడి నాయకత్వం (Visionary Leadership)లో దేశం ఎదుగుదలను అంతర్గతంగా కానీ, బాహ్యంగా గానీ ఎవరూ ఆపలేరని ఉపరాష్ట్రపతి స్పష్టం చేశారు.



Next Story

Most Viewed