తెలంగాణ భగత్ సింగ్ ఆయనే.. మాజీ MP వీహెచ్ కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |   ( Updated:2025-02-20 17:10:58.0  )
తెలంగాణ భగత్ సింగ్ ఆయనే.. మాజీ MP వీహెచ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఉద్యమకారుడు సిరిపురం యాదయ్య(Siripuram Yadaiah) 15వ వర్ధంతి కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని అమరవీరుల స్మారక స్థూపం వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంత రావు(V. Hanumantha Rao) మాట్లాడుతూ.. తెలంగాణ నిజమైన హీరో, తెలంగాణ భగత్ సింగ్(Bhagat Singh) సిరిపురం యాదయ్య అన్నారు. యాదయ్య విగ్రహాన్ని ఈరోజు వరకు ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటు అన్నారు. తప్పకుండా సిరిపురం యాదయ్య ఫొటో ఇస్తే.. తానే స్వయంగా సొంత ఖర్చులతో సిరిపురం యాదయ్య విగ్రహాన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం వద్ద.. ముఖ్యమంత్రితో మాట్లాడి ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ఉద్యమకారులను గుర్తిస్తుంది, గౌరవిస్తుందని తెలిపారు. తెలంగాణ ఉద్యమం ఆ స్థాయిలో జరగడానికి సిరిపురం యాదయ్యే కారణమన్నారు. ఆయన త్యాగం ఎప్పటికీ మర్చిపోలేం అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన ప్రముఖులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed