- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నవ్వులు పూయిస్తున్న మాజీ MP వీహెచ్ కామెంట్స్.. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్..! (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని తుక్కుగూడలో ఈ నెల 17వ తేదీన టీ కాంగ్రెస్ తలపెట్టిన విజయభేరి భారీ బహిరంగ సభకు ఆ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు హాజరువుతున్నారు. ఒకే వేదికపైకి కాంగ్రెస్ అగ్రనేతలు ముగ్గురు వస్తుండటంతో తెలంగాణ హస్తం నేతలు సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సభను గ్రాండ్‌గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక, కాంగ్రెస్ విజయభేరి సభ నిర్వహణపై పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీహెచ్ స్పందించారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఇచ్చిన సోనియా తల్లి రాష్ట్రానికి వస్తున్నారని.. లక్షల మందితో సభను భారీ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇదిలా ఉంటే.. మీడియాతో మాట్లాడే క్రమంలో వీహెచ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తున్నాయి. ‘‘సభకు లక్షలాది మంది వస్తరండి.. ఎందుకంటే సోనియాగాంధీ ఇచ్చిన తల్లి వస్తుంది’’ అంటూ వీహెచ్ పప్పులో కాలేశారు.
తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ వస్తుందనడానికి బదులు.. ‘‘సోనియాగాంధీ ఇచ్చిన తల్లి వస్తుంది’’ అంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. అంతేకాకుండా ‘‘తిరగబడదాం.. తరిమికొడదాం’’ అనే టీ- కాంగ్రెస్ ఎన్నికల నినాదాన్ని సైతం వీహెచ్ వెరైటీ స్టైల్‌లో చెప్పారు. దీంతో వీహెచ్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కింద ఉన్న వీడియోలో మీరు వీహెచ్ కామెంట్స్ చూసేయండి మరీ.