Ponguleti Srinivasa Reddy : రెండు, మూడు రోజుల్లో ప్రకటిస్తా.. భేటీ అనంతరం పొంగులేటి కీలక వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2023-06-21 11:27:58.0  )
Ponguleti Srinivasa Reddy : రెండు, మూడు రోజుల్లో ప్రకటిస్తా.. భేటీ అనంతరం పొంగులేటి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ వెబ్‌డెస్క్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ ముగిసింది. ఇవాళ హైదరాబాద్‌‌లోని పొంగులేటి నివాసానికి వెళ్లిన కాంగ్రెస్ నేతలు దాదాపు ఆయనతో రెండు గంటల పాటు చర్చించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరాలని పొంగులేటిని వారు ఆహ్వానించారు. ఈ భేటీ అనంతరం పొంగులేటి మీడియాతో మాట్లాడారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆహ్వానించారని తెలిపారు. మరో రెండు మూడు రోజుల్లో మా నిర్ణయం వెల్లడిస్తామని ఈ సందర్భంగా పొంగులేటి చెప్పారు.

ప్రత్యేక తెలంగాణ వచ్చాక రాష్ట్ర ప్రజల కలలు సాకారం కాలేదన్నారు. ప్రజల కలలు కలలుగానే మిగిలిపోయాయన్నారు. తెలంగాణ ప్రజల బాగు కోసం అందరం ఏకమవుతున్నామని అన్నారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆరు నెలల నుంచి రాష్ట్రంలో జరుగుతోన్న పరిస్థితులను ప్రజలు గమనిస్తున్నారని.. తాను, జూపల్లి కలిసి తెలంగాణలో పర్యటిస్తున్నామని తెలిపారు. ఉద్యమకారులు, ప్రజలు, కవులు, ప్రజలతో ఇప్పటికే చర్చలు జరిపామని.. కొద్ది రోజుల్లోనే పార్టీ వివరాలను ప్రకటిస్తామని క్లారిటీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed