- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Jaggareddy: నా నియోజకవర్గంలో హైడ్రా కూల్చివేతలు ఉండకూడదు
దిశ, వెబ్‌డెస్క్: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్(Ranganath)కు టీ.కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి(Jaggareddy) కీలక విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం పత్రికా ప్రకటన విడుదల చేశారు. ‘ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఔటర్ రింగ్ రోడ్డు లోపల మాత్రమే హైడ్రా చర్యలు చేపడుతుందని ప్రకటించారు. రింగ్ రోడ్డు బయట హైడ్రా(Hydraa) యాక్షన్ ఉండదని అన్నారు. కానీ నా నియోజకవర్గంలో హైడ్రా పేరుతో కూల్చివేతలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది.. దయచేసి అధికారులు అత్యుత్సాహం చూపించకండి.. నా నియోజకవర్గ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయకండి’ అని రిక్వెస్ట్ చేశారు.
ఇది హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు నా సూచన అని పేర్కొన్నారు. ‘ఎందుకంటే నా నియోజకవర్గం ఔటర్ రింగ్ రోడ్డుకు బయట ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన దాని ప్రకారం నా నియోజకవర్గంలో కూల్చివేతలు ఉండకూడదు. ఒకవేళ ఏమైనా చర్యలు తీసుకోవాలనుకుంటే ముందుగా నా దృష్టికి తీసుకురండి. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడతా’ అని రంగనాథ్‌కు జగ్గారెడ్డి సూచనలు చేశారు.