- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ ప్రజలకు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక పిలుపు
దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్లచట్టాలు రైతులు, కూలీలను హత్య చేసే విధంగా ఉన్నాయని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. అందుకే ఈ నెల 16న నిరసనలు చేపట్టాలని నిర్ణయించామని, దీన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఉన్నదని ఆయన పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. అన్ని పార్టీలు, సంఘాలకు ఆహ్వానం పలుకుతున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్ కిసాన్ సెల్ ఆధ్వర్యంలో ఈ నిరసనలు ఉంటాయన్నారు.
దేశ వ్యాప్తంగా ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళనలు జరగనున్నాయన్నారు. మోడీ నల్లచట్టాలను తీసుకొచ్చి రైతులను మోసం చేశారన్నారు. రైతులు ఎన్నోసార్లు ధర్నాలు చేసినా ఇప్పటి వరకు రద్దు చేయకపోవడం విచిత్రంగా ఉన్నదన్నారు. మూడు పార్లమెంట్ సెషన్స్ జరిగినా బిల్లులు వెనక్కి తీసుకోలేదన్నారు. మద్ధతు ధరపై దృష్టి పెట్టకుండా మోడీ, రైతులను ఇబ్బంది పెట్టే ప్రక్రియకు పూనుకూన్నాడని ఫైర్ అయ్యారు. ఈ మీటింగ్‌లో కిసాన్ జాతీయ అధ్యక్షుడు కోదండరెడ్డి ఉన్నారు.