Talasani Srinivas Yadav: ఆ రిపోర్ట్‌లో నాలుగు బాటిల్స్ ఎక్కువ ఉన్నాయి

by Gantepaka Srikanth |
Talasani Srinivas Yadav: ఆ రిపోర్ట్‌లో నాలుగు బాటిల్స్ ఎక్కువ ఉన్నాయి
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఏం జరుగుతుందో అసలు అర్ధం కావడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani Srinivas Yadav) అన్నారు. ఆదివారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. రాజ్ పాకాల సొంత ఇళ్ళు కట్టుకుని గృహ ప్రవేశం చేసుకున్నారు. కేటీఆర్(TR) బావమరిది కాబట్టి బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. టార్గెట్ చేసి రచ్చ చేస్తున్నారు. అసలు కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? అని తలసాని ప్రశ్నించారు. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్‌లో నాలుగు బాటిల్స్ ఎక్కువ ఉన్నాయి. ఆబ్కారీ, పోలీసు వాళ్ళు పంచనామా చేసి నాలుగు బాటిల్స్ ఉన్నాయని చెప్పారు. వ్యక్తిని, వ్యక్తి కుటుంబాన్ని టార్గెట్ చేయడం రాజకీయాల్లో పద్దతి కాదు.

జన్వాడ ఫార్మ్ హౌస్(Janwada Farm House) ఎక్కడ ఉంది రాజ్ పాకాల ఇల్లు ఎక్కడ ఉంది. గేటెడ్ కమ్యూనిటీలో చాలామంది ఉంటారు. కుట్ర చేయాలనే పోలీసులు సోదాలు అంటున్నారు. కేటీఆర్(KTR) ఫ్యామిలీ కాబట్టే బద్నాం చేస్తున్నారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి. వ్యక్తిగత కక్షలు రాజకీయాల్లో చూస్తున్నాం రాజకీయ పార్టీపైన, కుటుంబంపైన బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారు. సెర్చ్ వారెంట్ లేకుండా రాజ్ పాకాల ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం పోలీసులు చేశారు. దీని వెనుక బలమైన కుట్రకోణం ఉంది. రాష్ట్రంలో సమస్యలపై దృష్టి పెట్టండి. ఫార్మ్ హౌస్‌కు సొంత ఇంటికి సంబంధం ఏంటి? అని తలసాని శ్రీనివాస్ యాదవ్ అడిగారు.

Advertisement

Next Story

Most Viewed