- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ విషయం ఎవరూ మర్చిపోవద్దు.. నగర కార్పొరేటర్లకు తలసాని కీలక పిలుపు
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అడ్డగోలు హామీలను అమలు చేయడం వారికి సాధ్యం కాదని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కార్పొరేటర్లతో కేటీఆర్, తలసాని సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తలసారి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. అధికారంలో ఉన్న, లేకున్నా తమ తమ డివిజన్‌లో ప్రజలతో కలిసి పని చేద్దామని కార్పొరేటర్లకు పిలుపునిచ్చారు. పది సంవత్సరాలలో తెలంగాణ ప్రభుత్వం అద్భుతంగా నగరాన్ని అభివృద్ధి చేసిందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందించిందని గుర్తుచేశారు.
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పాలనపై ప్రజల అసంతృప్తి నెలకొందని కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్పొరేటర్ల వెంట, జీహెచ్ఎంసీ పార్టీ శ్రేణుల వెంట మొత్తం పార్టీ నిలబడుతుందని భరోసా ఇచ్చారు. అధికారులు, ప్రభుత్వం ఒత్తిడికిలోనై గతంలో ఇచ్చిన నిధులను, పనులు చేయడం లేదని అన్నారు. ఈ కక్షపూరిత విధానంపైన ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వంపైన ఒత్తిడి తీసుకొచ్చి మన ప్రజలకు డివిజన్‌లో అవసరమైన కార్యక్రమాలు అమలు అయ్యేలా చేద్దామని అన్నారు.