- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రుణమాఫీపై రేవంత్ సర్కార్‌కు చిత్తశుద్ధి లేదు: నిరంజన్ రెడ్డి ఫైర్
దిశ, వెబ్‌డెస్క్: రుణమాఫీపై రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బీఆర్ఎస్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ భవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియాలో సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతు బంధు, రుణమాఫీ రెండింటికీ పట్టాదారు పాస్ బుక్ ప్రామాణికమైనప్పుడు.. రుణమాఫీ చేసిన రైతులకు రైతు భరోసా ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. ఐదెకరాలలోపు రైతులకైనా వెంటనే రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఒకే విడతలో రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్పిందని.. మరీ ఇప్పుడు విడతల వారీగా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. అర్హులైన రైతులందరికీ ఒకే విడతలో రుణమాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కొంత మందికి రుణమాఫీ చేసి సంబురాలు చేసుకోకండని ఎద్దేవా చేశారు. రైతు రుణమాఫీకి అర్హులైన రైతుల లెక్కలను ప్రభుత్వం ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు. కరోనా మహ్మమారి విపత్తు సమయంలో బీఆర్ఎస్ రైతు బంధు ఇచ్చిందని.. రూ.29 వేల కోట్లు షరతులు లేకుండా మాఫీ చేసిందని గుర్తు చేశారు.