- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
KCR ఫోన్ సైతం ట్యాప్.. లైట్ తీసుకున్నాం: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో సంచలనం రేపుతోన్న ఫోన్ ట్యాపింగ్ కేసుపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చే సమయం సీఎం రేవంత్ రెడ్డికి లేదని.. ఎంత సేపు పక్కవారిపై నిందలు వేయడమే ఆయన పని అని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలో ప్రజాప్రతినిధిని కొనుగోలు చేయడానికి వెళ్లి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. లైవ్‌లో దొరికిన రేవంత్‌కు లై డిటెక్టర్ పెడితే ఎలా ఉంటుందని ప్రశ్నించారు. కేసీఆర్‌కు లై డిటెక్టర్ పెడితే కాళేశ్వరం విషయాలు బయటకు వస్తాయని రేవంత్ మాట్లాడడం అవివేకమన్నారు.
సీఎం పదవిలో ఉండి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వారిని అలా మాట్లాడతారా..? అని అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబు, వైఎస్ హయాంలో జరిగిన ఎన్ కౌంటర్లు ఫలానా వాళ్లు చెబితే చేశామని ఎవరైనా పోలీసు అధికారులు చెప్తారా..? అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్.. లీగల్ సెన్స్ లేని నాన్సెన్స్ అని అభివర్ణించారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసిన విషయం తెలిసినా దాన్ని పట్టించుకోలేదు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సిల్లీ ఇష్యూగా పక్కనపెట్టామని తెలిపారు. కాంగ్రెస్ వైఫల్యాలు తెరమీదకు రాగానే డైలీ సీరియల్లా ఏదో ఒక లీకు విడిచి ప్రజల అటెన్షన్ డైవర్షన్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ అనేది వ్యవస్థలో భాగంగా ఆయా సంస్థల పరిధిలో జరిగేదని స్పష్టం చేశారు. రోజు వారీ లీకులతో వార్తలు రాయించడం కూడా నేరమేనని, వార్తలు రాయించడంతో పాటు తీర్పులు కూడా ఇచ్చేస్తున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
కేసీఆర్‌ను, బీఆర్ఎస్ నేతలను బద్నాం చేయడమే లక్ష్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడుస్తుందని మండిపడ్డారు. ట్యాపింగ్ కేసులో లీకు వార్తలు ఇలాగే కొనసాగితే లీగల్‌గా ముందుకెళ్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వంపైన విమర్శలు చేయటం తప్ప చేసింది ఏమి లేదేని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో మహిళల ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఏ హామీలు అమలు కాలేదని విమర్శించారు. కాంగ్రెస్ ఇస్తామన్న బోనస్ బోగస్‌లా అయ్యిందని ఎద్దేవా చేశారు. రైతులపై లాఠీ చార్జీ చేయటం సరికాదన్నారు. గతంలో రైతులు విత్తనాల కోసం లైన్లో ఎక్కడ నిలబడలేదని, కాంగ్రెస్ వచ్చాక ఇప్పుడే ఎందుకు లైన్‌లో నిలబడే పరిస్థితి వచ్చిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇప్పటికైనా ఇచ్చిన హామీల అమలు మీద దృష్టి పెట్టాలని హితవు పలికారు.