- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ
దిశ, వెబ్‌డెస్క్: ఎల్‌ఆర్ఎస్‌పై సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ఎలాంటి ఛార్జీలు లేకుండా ఎల్‌ఆర్ఎస్ అమలు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎల్‌ఆర్ఎస్ అంటే దోపిడీ అని గతంలో మీరు అన్నారు.. ఇవాళ ఎల్‌ఆర్ఎస్ పేరుతో ప్రజలను ఎందుకు దోపిడీ చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రజల కోరిక మేరకు ఉచితంగా ఎల్‌ఆర్ఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఇచ్చిన మాట తప్పినందుకు ప్రజలను క్షమాపణ కోరాలని లేఖలో సూచించారు. కాగా, ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పెండింగ్‌లో ఉన్న ఎల్ఆర్‌ఎస్ దరఖాస్తులను క్రమబద్దీకరించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. మార్చి 31వ తేదీ వరకు లే-అవుట్‌ల క్రమబద్దీకరణకు డైడ్ లైన్ విధించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన ప్రకారమే ఛార్జీలు దరఖాస్తులకు వసూల్ చేయాలని నిర్ణయించుకుంది.
దీంతో ఎల్‌ఆర్ఎస్ దరఖాస్తుల క్రమబద్దీకరణకు చార్జీలు వసూల్ చేయాలన్న ప్రభుత్వం నిర్ణయంపై బీఆర్ఎస్ భగ్గమంటోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల క్రమబద్దీకరణకు చార్జీలు వసూల్ చేయడాన్ని తప్పుబట్టింది. అధికారంలోకి వచ్చాక ఫ్రీగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల క్రమబద్దీకరణ చేస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎల్ఆర్ఎస్‌కు ఫీజు వసూల్ చేయడంపై బీఆర్ఎస్ మండిపడుతోంది. మాటి ఇచ్చినట్లుగానే ఫ్రీగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను క్రమబద్దీకరించాలని ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఒత్తిడి చేస్తోంది. ఇందులో భాగంగానే కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.