KTR: కాంగ్రెస్ రాగానే పట్టాలు తప్పిన ఐటీ హబ్‌లు.. ఇంటర్‌నెట్, విద్యుత్ కట్: కేటీఆర్

by Ramesh N |
KTR: కాంగ్రెస్ రాగానే పట్టాలు తప్పిన ఐటీ హబ్‌లు.. ఇంటర్‌నెట్, విద్యుత్ కట్: కేటీఆర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కొత్త కంపెనీల సంగతి దేవుడెరుగు, ఉన్న కంపెనీలు పోకుండా చూడండని మాజీ మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. ఈ మేరకు ఆయన ఇవాళ ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. హైదరాబాద్ నగరం ఒక్కటే కాకుండా తెలంగాణలోని అన్ని ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా ఐటీ రంగాన్ని విస్తరించాలనే ఉద్దేశంతో సుమారు ఎనిమిది (IT hubs) ఐటీ హబ్‌లను (BRS) బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.

కానీ, కాంగ్రెస్ (Congress) రాగానే మంచిగా నడుస్తున్న ఆ ఐటీ హబ్‌లు ఒక్కొక్కటిగా పట్టాలు తప్పుతున్నాయని తెలిపారు. విద్యుత్, ఇంటర్నెట్ బిల్లులు కూడా కట్టని దుస్థితికి చేరుకున్నాయని, ఫలితంగా కంపెనీలు మూతపడుతున్నాయని ఆరోపించారు. గత ప్రభుత్వం మీద కోపంతో ఇలాంటి దుశ్చర్యలు మానండని కాంగ్రెస్ సర్కార్‌కు సూచించారు. తెలంగాణ యువతకు ఉద్యోగాలు కల్పించే సదుద్దేశంతో నెలకొల్పిన ఈ ఐటీ హబ్‌లను సక్రమంగా నడపాలని కోరారు.

Next Story

Most Viewed