- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పార్టీలో చేరిక అప్పుడే.. ముహూర్తం అనౌన్స్ చేసిన మాజీమంత్రి జూపల్లి
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురైన ఆయన రాజకీయంగా తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఉత్కంఠ రేపుతోంది. ఈ క్రమంలో పొంగులేటితో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్న జూపల్లి తాజాగా పార్టీ మార్పుపై స్పష్టత ఇచ్చారు. ఏ పార్టీలో చేరాలనేది క్లారిటీతోనే ఉన్నానన్నారు. ఎప్పుడు చేరుతాను అనేది జూన్‌లో నిర్ణయం వెల్లడిస్తానని చెప్పారు.
శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తనతో పాటు తన వెంట వచ్చేందుకు అనేక మంది సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్‌కు రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత లేదని దుయ్యబట్టారు. కర్ణాటక ఫలితాలు చూసి కేసీఆర్‌కు భయం పట్టుకుందని.. తెలంగాణలోనూ అవే ఫలితాలు రిపీట్ అవుతాయన్నారు. ఇన్నాళ్లు దళితులను అవమానించిన కేసీఆర్ ఎన్నికల సమయంలో అంబేద్కర్ జపం చేస్తున్నాడని విమర్శించారు.