హరీష్ రావు గురించి మైనంపల్లి చెప్పిందంతా పక్కా నిజమే: మాజీ మంత్రి జూపల్లి

by Satheesh |   ( Updated:22 Aug 2023 8:22 PM  )
హరీష్ రావు గురించి మైనంపల్లి చెప్పిందంతా పక్కా నిజమే: మాజీ మంత్రి జూపల్లి
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేసీఆర్‌కు దిమ్మతిరిగేలా ప్రజాతీర్పు ఇవ్వాలని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆగ మేఘాల మీద 115 సీట్లకు అభ్యర్థులను ప్రకటించారని, దాని వల్ల ప్రజలకు ఏం ఉపయోగం లేదన్నారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. ఇప్పటి నేతలంతా గతంలో పోటీ చేశారని, కానీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నదన్నారు. ఇక మైనంపల్లి హరీష్ రావు గురించి చెప్పిందంతా నిజమేనన్నారు. గతంలో డబ్బా పెట్టె స్లిప్పర్‌లు వేసుకున్నోళ్లకు.. వేల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.

మైనంపల్లి హన్మంతరావు తిరుపతి వెంకటేశ్వరుని సాక్షిగా మాట్లాడారని.. దాంట్లో అబద్దం ఉండదన్నారు. మైనంపల్లి దెబ్బ కేసీఆర్‌కి రుచి చూపించాలన్నారు. కేసీఆర్ కుటుంబానికి, నెహ్రు కుటుంబానికి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉన్నదన్నారు. కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి నుండి పోటీ చేస్తున్నారంటే ఓటమిని అంగీకరించినట్టేనని చెప్పారు. తెలంగాణలో అవినీతి, అరాచకం, భూకబ్జాలు పెట్రేగిపోతున్నాయన్నారు. కేసీఆర్ పాలన ఎండ్‌కి వచ్చిందని, ఈ ఎన్నికల్లో కారును గుద్దుడు గుద్దతే అప్పడం కావాలని పిలుపునిచ్చారు.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed