- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాహుల్ గాంధీపై మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా పోస్టు చేశారు. రాహుల్ గాంధీ ద్వంద్వ విధానాలు, మోసపూరిత వైఖరి మహేష్‌కుమార్ గౌడ్ వ్యాఖ్యలతో మరోసారి రుజువైందని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో రాజ్యాంగాన్ని కాపాడుతున్నామంటూ తెలంగాణలో రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం.. రాహుల్ ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని హరీష్‌రావు పేర్కొన్నారు.
కాగా, ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను చేర్చుకోవడం అనేది పార్టీ అధిష్టానం నిర్ణయం అని చెప్పారు. పార్టీ నిర్ణయం ప్రకారమే ఎమ్మెల్యేలను చేర్చుకున్నామని అన్నారు. దీనివల్ల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రతిష్టకు ఎక్కడ భంగం వాటిల్లలేదని పేర్కొన్నారు. జీవన్ రెడ్డి విమర్శలు ఆయన వ్యక్తిగతమని, ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలను గౌరవించుకోవలసిన అవసరం ఉందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. తాజాగా ఈ వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్ ట్వీట్ పెట్టారు.