- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Students Protest : గురుకుల విద్యార్థినుల ఆవేదన వినిపించడం లేదా? హరీష్ రావు ఆసక్తికర ట్వీట్
దిశ, డైనమిక్ బ్యూరో: హాలియా పట్టణంలోని తుమ్మడం బీసీ గురుకుల బాలికల పాఠశాలలో ఆడిటోరియంలో కూర్చుని విద్యార్ధినులు ఆందోళన చేపట్టారు. మధ్యాహ్నం భోజనంలో నిత్యం పురుగుల అన్నం, చికెన్, సాంబార్ లలో నీళ్లు ఉన్నాయని తినలేక ఆకలితో అలమటిస్తున్నామని విద్యార్థులు నిరసన తెలిపారు. ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని గురుకుల బాలికలు ఆవేదన వ్యక్తంచేశారు.
ఈ విషయంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్‌రావు స్పందించారు. మంగళవారం ఎక్స్ వేదికగా హరీష్ రావు విద్యార్థులు నిరసన తెలియజేసిన వీడియోలు పోస్ట్ చేస్తూ.. ‘తొమ్మిది నెలల కాంగ్రెస్ పాలనలో గురుకులాల్లో నెలకొన్న అద్వాన్న పరిస్థితులకు ఇది మరో ఉదాహరణ. పరిపాలనను గాలికి వదిలేసి అనునిత్యం రాజకీయాలే చేసే సీఎం రేవంత్ రెడ్డికి హాలియా పట్టణంలోని తుమ్మడం బీసీ గురుకుల బాలికలు ఆవేదన వినిపించడం లేదా? అంటూ తెలంగాణ సీఎంవోను ప్రశ్నించారు.